Fri Mar 20 2026 21:13:41 GMT+0530 (India Standard Time)
శోభనం గది నుంచి పారిపోయిన పెళ్లి కొడుకులా కేసీఆర్ తీరు

తెలంగాణ ప్రజలు ఆకాశమంత పందిరి వేసి తెలంగాణకు కేసీఆర్ కు పెళ్లి చేస్తే శోభనం గది నుంచి బయటకు వచ్చినట్లుగా కేసీఆర్ వైఖరి ఉందని సీపీఐ నేత నారాయణ ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పూర్తి మెజారిటీ ఇచ్చినా పరిపాలించే బలం కేసీఆర్ కు లేదని స్పష్టమవుతోంది. సాఫీగా సాగుతున్న ప్రభుత్వాన్ని నడిపించలేక కేసీఆర్ చేతులెత్తేశారని, మళ్లీ గెలిపించినా కేసీఆర్ మధ్యలోనే విడిచిపెడతారని విమర్శించారు. కేసీఆర్ వి మాటల ఆడంబరం తప్ప చేతలు కనపడటం లేదని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం స్వతంత్రంగా వ్యవహరించడం లేదనే అనుమానాలు ఉన్నాయని, ఈ విషయమై ఎన్నికల సంఘాన్ని కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
Next Story

