Thu Mar 19 2026 18:18:02 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : ప్రధానితో ముగిసిన కేసీఆర్ భేటీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఢిల్లీలో లోక్ కళ్యాణ్ మార్గ్ లో ఆయన 20 నిమిషాల పాటు వీరి భేటీ జరిగింది. ముఖ్యంగా జోన్ల వ్యవస్థకు ఆమోదం తెలపాలని ప్రధానిని కేసీఆర్ కోరినట్లు తెలిసింది. మరో 11 ఇతర అంశాలకు సంబంధించి కూడా ప్రధానికి వినతిపత్రాలు సమర్పించారు. ఇక భేటీ కేవలం 20 నిమిషాలు మాత్రమే జరగడం చూస్తే ముందస్తు ఎన్నికలపై చర్చ జరిగి ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
Next Story

