Thu Mar 19 2026 03:10:08 GMT+0530 (India Standard Time)
రాహుల్ పర్యటనకు...కేసీఆర్ డైవర్షన్ స్కెచ్..?

టీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఎన్నికలకు సన్నద్దం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు ప్రారంభించారు. ఈ మేరకు ఆయన సోమవారం మధ్యాహ్నం 3:30 గంటలకు తెలంగాణ భవన్ లో కేసీఆర్ అధ్యక్షతన ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు. ముందస్తు ఎన్నికల వైపు కేసీఆర్ మొగ్గు చూపుతున్నారన్న ప్రచారం నేపథ్యంలో ఇవాళటి సమావేశంపై ఆసక్తి నెలకొంది. అయితే, తెలంగాణలో రాహుల్ రెండు రోజుల టూర్ నేపథ్యంలో ప్రజలు, మీడియా అటెన్షన్ డైవర్ట్ చేసే వ్యూహంతోనే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. ఇవాళ ఏవైనా కీలకవ్యాఖ్యలు లేదా ప్రకటన చేసే అవకాశం కూడా కనిపిస్తోంది.
Next Story

