Fri Mar 20 2026 17:34:36 GMT+0530 (India Standard Time)
అతను వస్తే మా గెలుపు ఇంకా సులువు

అసెంబ్లీ రద్దు తర్వాత ముఖ్యమంత్ర కేసీఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శించారు. రాహుల్ గాంధీ దేశంలోనే పెద్ద బఫూన్ అని విమర్శించారు. పార్లమెంట్ లో ప్రధాని మోదీని కౌగిలించుకోవడం, కన్ను కొట్టడం ప్రతి ఒక్కరూ చూశారని గుర్తు చేశారు. రాహుల్ గాంధీ తెలంగాణలో ప్రచారం చేస్తే తమ గెలుపు ఇంకా సులభం అవుతుందని ఎద్దేవా చేశారు. తెలంగాణను మొదటి నుంచి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, గాంధీ కుటుంబమే అని ఆరోపించారు.
Next Story

