Thu Mar 19 2026 23:16:17 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : గవర్నర్ తో కేసీఆర్ భేటీ

గవర్నర్ నరసింహన్ తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. మంగళవారం సాయంత్రం ఆయన రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ ను కలిశారు. ముందస్తు ఎన్నికలకు వెళతారన్న ఊహాగానాల నేపథ్యంలో గవర్నర్ తో కేసీఆర్ భేటీకి ప్రధాన్యత ఏర్పడింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై గవర్నర్ తో కేసీఆర్ చర్చించే అవకాశం కనపడుతోంది. ఆయన గత వారం ఢిల్లీ వెళ్లే ముందు కూడా గవర్నర్ తో సమావేశమయ్యారు.
Next Story

