Wed Mar 18 2026 10:41:07 GMT+0530 (India Standard Time)
ప్రధాని మోదీకి కేసీఆర్ సవాల్

నిజామాబాద్ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ నిజామాబాద్ ప్రజలు కరెంటు లేక ఇబ్బందులు పడుతున్నారంటూ చేసిన వ్యాఖ్యలపై కేసీఆర్ మండిపడ్డారు. తాను నిజామాబాద్ కి హెలీకాఫ్టర్ తీసుకుని వెంటనే వస్తానని... ఓ సభ పెట్టి ప్రజలు కరెంటు లేక ఇబ్బంది పడుతున్నారా అనేది చర్చ చేద్దామని సవాల్ విసిరారు. ప్రధాని స్థాయిలోని వ్యక్తి కరెంటు విషయంలో ఇలా అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. దేశంలో 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు. రాజకీయాల కోసం ప్రధాని స్థాయి వ్యక్తి అబద్ధాలు చెప్పడం సరికాదన్నారు. తాను ప్రధానికి భయపడాల్సిన అవసరం లేదని... తాను చంద్రబాబు నాయుడును కాదని భయపడటానికి... తన జీవితం తెరిచిన పుస్తకం అని స్పష్టం చేశారు.
Next Story

