Mon Mar 23 2026 16:58:49 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : వైఎస్ జగన్ కు కేసీఆర్ ఫోన్

హత్యాయత్నానికి గురైన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫోన్ చేసి పరామర్శించారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన దాడి, గాయం తీవ్రత, చికిత్స అందుతున్న విధానాన్ని ఆయన అడిగి తెలుసుకున్నారు. తగినంత విశ్రాంతి తీసుకోవాలని ఆయన సూచించారు. జగన్ త్వరగా కోలుకోవాలని కేసీఆర్ ఆకాంక్షించారు.
Next Story

