Fri Jan 30 2026 00:17:14 GMT+0000 (Coordinated Universal Time)
ప్రమాణస్వీకారం చేయనున్న ఏకైక మంత్రి ఆయనేనా..?

ఇవాళ మధ్యాహ్నం 1.25 గంటలకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేస్తున్నారు. ఇందుకు రాజ్ భవన్ వేదికయ్యింది. అయితే, కేసీఆర్ కేబినెట్ కూర్పు ఇంకా పూర్తి కాలేదు. కేబినెట్ లోకి ఎవరిని తీసుకోవాలనేది ఇంకా కేసీఆర్ నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఇవాళ ఆయన ఒక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నారని అనుకున్నారు. కానీ, కేసీఆర్ తో పాటు ఎమ్మెల్సీ మహబూద్ అలీ కూడా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ మేరకు కేసీఆర్ ఆయనకు ఫోన్ చేసి రాజ్ భవన్ రావాల్సిందిగా ఆహ్వానించారు. మహమూద్ అలీ ఇంతకుముందు డిప్యూటీ సీఎంగా పనిచేశారు. ఆయన మొదటి నుంచి కేసీఆర్ వెన్నంటే నమ్మకంగా ఉన్నారు. దీంతో ఆయనకే మరోసారి మైనారిటీ కోటా పదవి ఇచ్చేందుకు కేసీఆర్ నిర్ణయించారు. మిగతా మంత్రులతో ఈ నెల 18వ తేదీ ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.
Next Story

