Mon Mar 16 2026 09:55:09 GMT+0530 (India Standard Time)
ముఖ్యమంత్రి పదవి ఎవరో పెట్టిన బిక్ష కాదు
తనకు ముఖ్యమంత్రి పదవి ఎవరో ఇవ్వలేదని తెలంగాణ ప్రజలు మాత్రమే ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హాలియా సభలో కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ కు సీఎం [more]
తనకు ముఖ్యమంత్రి పదవి ఎవరో ఇవ్వలేదని తెలంగాణ ప్రజలు మాత్రమే ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హాలియా సభలో కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ కు సీఎం [more]

తనకు ముఖ్యమంత్రి పదవి ఎవరో ఇవ్వలేదని తెలంగాణ ప్రజలు మాత్రమే ఇచ్చారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. హాలియా సభలో కేసీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ కు సీఎం పదవి ఇచ్చింది జానారెడ్డి అని జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ప్రత్యేక తెలంగాణ కోసం తాను అనేక పదవులను తృణప్రాయంగా వదులుకున్నానని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. పదవుల కోసం తెలంగాణను వదిలేసింది కాంగ్రెస్ మాత్రమేనని ఆయన అన్నారు. నోముల భగత్ ను గెలిపించాలని కేసీఆర్ కోరారు. తనకు అధికారం కొత్త కాదని ఆయన చెప్పారు. నోముల భగత్ ను గెలిపిస్తే మరోమారు సాగర్ వచ్చి అభివృద్ధి పనులను వేగం పెంచుతానని కేసీఆర్ స్పష్టం చేశారు.
Next Story