Fri Mar 27 2026 20:57:30 GMT+0530 (India Standard Time)
విశాఖలో కేసీఆర్ అడుగుపెట్టగానే....!!

విశాఖ ఎయిర్ పోర్టు చేరుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావుకు ఘన స్వాగతం లభించింది. విశాఖ ఎయిర్ పోర్టులో గులాబీ జెండాలు రెపరెపలాడాయి. ఏపీలోని ఆయన అభిమానులు పెద్దయెత్తున ఎయిర్ పోర్టుకు చేరుకుని ఆయనకు స్వాగతం పలికారు. జై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్ తన కుటుంబ సభ్యులతో కలసి విశాఖలోని శారదా పీఠం చేరుకున్నారు. ఆయన అక్కడ ప్రత్యేక పూజలు చేయనున్నారు. శారదా పీఠాధిపతి శ్రీ సర్వూపనందేంద్ర స్వామి ఆశీస్సులు పొందనున్నారు. అక్కడే భోజనాలు చేసిన తర్వాత ఆయన విశాఖ నుంచి ఒడిశా వెళ్లి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తో భేటీ కానున్నారు.
Next Story

