Thu Mar 19 2026 01:15:03 GMT+0530 (India Standard Time)
కత్తి ఎపిసోడ్ పై మెగా బ్రదర్ సీరియస్

హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ పై పోలీసులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని సినీ నటుడు నాగబాబు డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే పరిస్థితులు వస్తాయని పేర్కొన్నారు. కత్తి వ్యాఖ్యలపై స్పందించిన ఆయన...రామాయనం కేవలం పుస్తకం కాదని, కోట్లాది మంది హిందువులు ఆరాధించే చరిత్ర అని పేర్కొన్నారు. నాస్తికత్వం పేరుతో మత విశ్వాసాలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. హిందూ మతం, దేవతలపై పథకం ప్రకారం దాడి జరుగుతోందని ఆయన ఆరోపించారు.
Next Story

