Wed Mar 18 2026 19:10:59 GMT+0530 (India Standard Time)
కత్తి మహేష్ పై నగర బహిష్కరణ

ఓ టీవీ ఛానల్ చర్చలో శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సినీ విమర్శకుడు కత్తి మహేష్ పై హైదరాబాద్ పోలీసులు చర్యలు తీసుకున్నారు. కత్తి మహేష్ పై నగర బహిష్కరణ వేటు వేశారు. పోలీసుల అనుమతి లేకుండా హైదరాబాద్ రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా కత్తి మహేష్ ను తెలంగాణ టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ పోలీసులకు అప్పగించారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ పై చర్యలు తీసుకోవాలంటూ పలు ధార్మిక సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు ఈ ఆదేశాలు జారీ చేశారు.
Next Story

