Thu Mar 19 2026 04:09:42 GMT+0530 (India Standard Time)
రెండు గంటల పోలీసుల అదుపులో కత్తి

హిందువుల మనోభావాలను కించపర్చారనే ఫిర్యాదుపై కత్తి మహేష్ ని హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. రెండు గంటల పాటు కత్తి మహేష్ కు ప్రశ్నలు సంధించారు పోలీసులు. ఏ సందర్భంలో అనాల్సి వచ్చింది? మీ వ్యాఖ్యలను సమర్థించుకుంటున్నారా? అని పోలీసులు ఆయన్ని ప్రశ్నించారు. 41 ఏ సీ.ఆర్.పీ.సీ నోటీసిచ్చారు. కేసు విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రావాల్సి ఉంటుందన్నారు. తానేం హిందువుల దేవుళ్లను అవమానించలేదని.. మత విద్వేషాలను రెచ్చగొట్టలేదని..చట్టానికి పూర్తిగా సహకరిస్తానని చెప్పారు కత్తి మహేష్.
Next Story

