కశ్మీర్ వివాదంలోకి హైదరాబాద్
కశ్మీర్ అంశంపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలె చేసిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సైఫుద్దీన్ సోజ్ మరోసారి అటువంటి వ్యాఖ్యలే చేశారు. అయితే, ఈసారి ఆయన హైదరాబాద్ ను ఈ వివాదంలోకి తీసుకువచ్చారు. స్వతంత్రం తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్... హైదరాబాద్ ను భారత్ తీసుకుని కశ్మీర్ ను పాకిస్థాన్ కి ఇవ్వాలనే ఆలోచన చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు అప్పటి పాక్ ప్రధాని లిఖ్వాత్ అలీ ఖాన్ తోనూ పటేల్ ఈ ప్రతిపాదన చేశారని పేర్కొన్నారు. సోజ్ రచించిన ‘గ్లిమ్ ప్సెస్ ఆఫ్ హిస్టరీ ఆండ్ స్టోరి ఆప్ స్ట్రగుల్’ పుస్తకావిష్కరణ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతకుముందు కూడా సోజ్ పాకిస్థాన్ మాజీ ప్రధాని ముషారఫ్ ను సమర్థిస్తూ వ్యాఖ్యలు చేశారు. అయితే, సోజ్ పై చర్యలు తీసుకుంటామని, ఆయన తన పుస్తకాన్ని అమ్ముకునేందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది.