Mon Feb 02 2026 15:52:26 GMT+0000 (Coordinated Universal Time)
కరుణానిధి గట్టోడు

తీవ్ర అస్వస్థతకు గురై చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నడీఎంకే అధినేత కరుణానిధిని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పరామర్శించారు. ఈరోజు సాయత్రం చెన్నైకు చేరుకున్న రాహుల్ గాంధీ నేరుగా కావేరి ఆసుపత్రికి వెళ్లారు. కరుణానిధి కుమారుడు స్టాలిన్ ఆయన చికిత్స పొందుతున్న గదిలోకి రాహుల్ ను తీసుకెళ్లారు. రాహుల్ వచ్చారని కరుణానిధికి చెవిలో చెబుతుండటం కన్పించింది. కరుణానిధిని పరామర్శించిన రాహుల్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తమిళనాడు లాగానే కరుణానిధి చాలా గట్టివారని రాహుల్ చమత్కరించారు. కరుణానిధి త్వరగా కోలుకోవాలని సోనియా గాంధీ కోరుకున్నట్లు రాహుల్ వెల్లడించారు.
Next Story
