Mon Feb 02 2026 13:13:39 GMT+0000 (Coordinated Universal Time)
కరుణ ఆరోగ్యం విషమించిందా?

తమిళనాడులో హైఅలెర్ట్ ప్రకటించారు. డీఎంకే అధినేత కరుణానిధి పరిస్థితి విషమించిదని తెలియడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. చెన్నైలో ఎక్కడచూసినా పోలీసులే కన్పిస్తున్నారు. ఇప్పటికే కరుణానిధి ఆరోగ్యం విషమించిందని తెలిసిన ఆయన ముగ్గురు అభిమానులు మృతి చెందారు. కరుణానిధి చికిత్స పొందుతున్న కావేరి ఆసుపత్రి వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాకుండా డీఎంకే కేంద్ర కార్యాలయం వద్ద పోలీసులు బందోబస్తును పెంచారు. ముఖ్యమంత్రి పళనిస్వామి తన ప్రయివేటు కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు. అయితే కరుణానిధి ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆయన కుమారుడు ఆళగిరి తెలిపారు. మరికొద్దిసేపట్లో కరుణానిధి హెల్త్ బులిటెన్ విడుదల కానుంది. కరుణానిధి చికిత్స పొందే కావేరి ఆసుపత్రి నుంచి ఆయన ఇంటివరకూ పోలీసులు మొహరించారు.
Next Story
