Mon Feb 02 2026 23:06:46 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : క్షీణించిన కరుణ ఆరోగ్యం

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే పార్టీ అధినేత కరుణానిధి ఆరోగ్యం పూర్తిగా విషమించింది. నిన్నటివరకు ఆయన కోలుకుంటున్నట్లు కనపడినా ఆయన ఆరోగ్యం ఇవాళ తీవ్రంగా విషమించినట్లు కావేరీ ఆసుప్రతి వైద్యులు తెలిపారు. ఈ మేరకు వారు కరుణ ఆరోగ్య పరిస్థితిపై హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. వయస్సురిత్యా కరుణ శరీరం వైద్యానికి సహకరించడం లేదని, ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిదని తెలిపారు. గత నెల 21న ఆసుపత్రిలో చేరిన కరుణ అప్పటి నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.
Next Story

