Tue Feb 03 2026 02:16:38 GMT+0000 (Coordinated Universal Time)
కలైంజ్ఞర్ కు తుది వీడ్కోలు

తమిళనాడు రాజకీయాల్లో ఒక శకం ముగిసింది. అశ్రునయనాల మధ్య తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అంత్యక్రియలు పూర్తయ్యాయి. తమ ప్రియతమ నాయకుడికి తుది వీడ్కోలు పలకడానికి లక్షలాదిగా తరలివచ్చిన అభిమానులు, దేశవ్యాప్తంగా కదిలివచ్చిన నేతల సమక్షంలో సైనిక లాంఛనాలతో ఆయన అంత్యక్రియలు పూర్తి చేశారు. చెన్నై మెరీనా బీచ్ ల అన్నాదురై సమాధి సమీపంలో కరుణ అంత్యక్రియలు జరిగాయి. ‘‘విశ్రాంతి ఎరుగక శ్రమించిన వ్యక్తి ఇక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు’’ అనే మాటలు రాసి ఉన్న శవపేటికలో ఆయన అంతిమసంస్కారాలు జరిపారు. కుటుంబసభ్యులు ఆయనకు తుది నివాళులర్పిస్తూ కన్నీటిపర్యంతమయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షడు రాహుల్ గాందీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, కాంగ్రెస్ నేతలు గులాం నబీ ఆజాద్, వీరప్ప మొయిలీ తదితరులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.
Next Story

