Sun Mar 22 2026 12:28:47 GMT+0530 (India Standard Time)
కర్ణాటక ఎమ్మెల్యేలకు సీమ అల్పాహారం

కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరు నుంచి నిన్న అర్ధరాత్రి నాలుగు బస్సుల్లో హైదరాబాద్ కు బయలుదేరారు. అర్ధరాత్రి బెంగళూరులో బయలుదేరిన ఎమ్మెల్యేల బస్సులు కొద్దిసేపటి క్రితం కర్నూలు చేరుకున్నాయి. కర్నూలులో వారికి అల్పాహారం ఏర్పాటు చేశారు. కర్నూలులో టిఫిన్లు పూర్తి చేసుకున్న ఎమ్మెల్యేలు హైదరాబాద్ ప్రయాణమయ్యారు. వీరంతా ఈ నెల 24, 25వ తేదీ వరకూ ఇక్కడే బస చేయనున్నారు. కర్ణాటక పీసీసీ చీఫ్ పరమేశ్వర్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు. ఎమ్మెల్యేలతో పరమేశ్వర్ మధ్యాహ్నం భేటీ కాబోతున్నారు. కాంగ్రెస్ కర్ణాటకలో మొత్తం 78 ఎమ్మెల్యేలు గెలవగా, అందులో ముగ్గురు మాత్రం క్యాంప్ లో లేరని తెలుస్తోంది. వీరు ముగ్గురు తమ వ్యక్తిగత పనులపై రాలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నప్పటికీ వారు జంప్ చేస్తారోనన్న భయం మాత్రం ఆ పార్టీని వెంటాడుతుంది.
- Tags
- amith shah
- b.s.yadurappa
- bangalore
- bharathiya janatha party
- devegouda
- governor
- hyderabad
- indian national congress
- janathadal s
- karnataka
- karnataka assembly elections
- kumara swamy
- narendra modi
- rahulgandhi
- sidharamaiah
- sriramulu
- yadurppa
- అమిత్ షా
- కర్ణాట అసెంబ్లీ ఎన్నికలు
- కర్ణాటక
- కుమారస్వామి
- గవర్నర్
- జనతాదళ్
- దేవెగౌడ
- నరేంద్ర మోదీ
- బి.ఎస్.యడ్యూరప్ప
- బెంగుళూరు
- భారత జాతీయ కాంగ్రెస్
- భారతీయ జనతా పార్టీ
- యడ్యూరప్ప
- రాహుల్ గాంధీ
- శ్రీరాములు
- సిద్ధరామయ్య
- హైదరాబాద్
Next Story

