Mon Mar 23 2026 00:55:26 GMT+0530 (India Standard Time)
పోలింగ్ ప్రారంభమయిందే

కర్ణాటక ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ పోలింగ్ జరగనుంది. మొత్తం 222 నియోజకవర్గాల్లో నేడు పోలింగ్ జరగనుంది. మొత్తం ఈఎన్నికల్లో 2600 మంది అభ్యర్థుల భవిష్యత్తును కన్నడ ఓటర్లు తేల్చనున్నారు. కర్ణాటక ఎన్నికల కోసం మొత్తం 55,600 పోలింగ్ బూత్ లను ఏర్పాటు చేశారు. కర్ణాటక వ్యాప్తంగా సుమారు 4.96 కోట్ల మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. దాదాపు మూడున్నర లక్షల మంది సిబ్బంది ఈ ఎన్నికల పర్యవేక్షణలో పాల్గొంటున్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి భద్రతపరమైన చర్యలు తీసుకున్నారు. బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ లు ఈ ఎన్నికల్లో హోరా హోరీ తలపడుతున్నాయి. కన్నడ ఓటర్ల తీర్పుపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.
Next Story

