Sat Mar 21 2026 20:49:12 GMT+0530 (India Standard Time)
కర్ణాటక కాంగ్రెస్ లో విషాదం

కర్ణాటక మంత్రివర్గం ప్రమాణస్వీకారం జరుగుతుందనుకుంటున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో విషాదం చోటు చేసుకుంది. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సిద్ధు బీమప్ప న్యామ గౌడ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈరోజు ఉదయం ఆయన గోవా నుంచి రోడ్డు మార్గంలో బాగల్ కోట్ కు వస్తున్నప్పుడు ఆయన ప్రయాణిస్తున్న కారును లారీ ఢీకొట్టింది. ఎమ్మెల్యే భీమప్ప అక్కడికక్కడే మృతి చెందారు. మొన్న జరిగన ఎన్నికల్లో భీమప్ప జంఖిండి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు మంత్రివర్గంలో చోటు ఉంటుందన్న ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన మరణించడం పట్ల కుటుంబసభ్యులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
Next Story

