ఈ సర్వేలు మాత్రం కమలానికి అనుకూలం

రిపబ్లికన్ టీవీ ఎగ్జిట్ పోల్స్ బీజేపీ కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తేల్చింది. బీజేపీకి కర్ణాటకలో 95 నుంచి 114 స్థానాలు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ కేవలం 73 నుంచి 82 స్థానాలకే పరిమితమవుతుందని చెప్పింది. ఇక కింగ్ మేకర్ కావాలనుకుంటున్న జనతాదళ్ ఎస్ కు 32 నుంచి 43 స్థానాలు, ఇతరులకు ఒక స్థానం నుంచి ఎనిమిది స్థానాలు వస్తాయని రిపబ్లికన్ టీవీ సర్వే తేల్చింది. ఇక సీ ఓటర్ సర్వే కూడా కర్ణాటకలో కమలం అతి పెద్ద పార్టీగా అవతరిస్తుందని చెప్పింది. సీ ఓటర్ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసిన ఫలితాలు ఇలా ఉన్నాయి.బీజేపీకి 97 నుంచి 109 సీట్లు, కాంగ్రెస్ కు 87 నుంచి 99 సీట్లు, జేడీఎస్ కు 21 నుంచి 30సీట్లు రావచ్చని పేర్కొంది. ఇతరులకు ఒకటి నుంచి ఎనిమిది స్థానాలు దక్కే అవకాశముంది. న్యూస్ ఎక్స్ సర్వే ప్రకారం బీజేపీ 102 స్థానాల నుంచి 110 స్థానాలు దక్కించుకునే వీలుంది. కాంగ్రెస్ 72 నుంచి 78 స్థానాల వరకే పరిమితమవుతుంది. ఇక జనతాదళ్ మాత్రం 35 నుంచి 39 వరకూ సీట్లు సాధించవచ్చు. ఇతరులు రెండు నుంచి మూడు స్థానాల్లో విజయం సాధిస్తారు.మొత్తం మీద ఈ సర్వేల్లో కూడా జనతాదళ్ కీలకంగా మారనుంది.
రిపబ్లికన్ టీవీ
బీజేపీ 95 - 114
కాంగ్రెస్ 73 - 82
జేడీఎస్ 32 - 43
ఇతరులు 1 - 8
సీ ఓటర్ సర్వే
బీజేపీ 97 - 109
కాంగ్రెస్ 87 - 99
జేడీఎస్ 21 - 30
ఇతరులు 1 - 8
న్యూస్ ఎక్స్ సర్వే
బీజేపీ 102 - 110
కాంగ్రెస్ 72 - 78
జేడీఎస్ 35 - 39
ఇతరులు 2 - 3
