Fri Mar 20 2026 09:45:12 GMT+0530 (India Standard Time)
కరీంనగర్ లో సైకో ఏం చేశాడంటే....?

కరీంనగర్ లో ఓ సైకో వీరంగం సృష్టించాడు. కలెక్టర్ ముందున్న మీసేవా కేంద్రంలోకి వెళ్లి అందులో పనిచేస్తున్న రసజ్ఞ అనే ఓ అమ్మాయిపై కత్తి తో దాడిచేసి.. గొంతుకోశాడు. దాంతో అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రసజ్ఞ మృతి చెందింది. సైకోను వంశీధర్ అనే యువకుడిగా గుర్తించారు. రసజ్ఞ, వంశీధర్ ఇద్దరూ గోదావరిఖనికి చెందిన వారు కాగా.. వీరిద్దరి మధ్యలో ఏంజరిగిందో ఏమో.. వంశీ రసజ్ఞను మీసేవా కేంద్రంలో లోకెళ్లి మరీ గొంతుకోసేశాడు. వెంటనే అక్కడున్న స్థానికులు పట్టుకుని దేహశుద్ధి చేసి వంశీని పోలీసులకు అప్పగించారు. మూడేళ్ల నుంచి ప్రేమించమని వెంట పడుతున్నాడు. రసజ్ఞ అందుకు అంగీకరించలేదు. రసజ్ఞ ను చంపేసిన తర్వాత వంశీ గొంతుకోసుకునే ప్రయత్నం చేశాడు.
Next Story

