Tue Mar 24 2026 16:50:10 GMT+0530 (India Standard Time)
కరణం అడ్డం తిరిగారే

తెలుగుదేశం సీనియర్ నేత కరణం బలరాం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యానించారు. ఆయన శాసనమండలిలో ప్రకాశం జిల్లా అభివృద్ధిపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లాను ఎందుకు అభివృద్ధి చేయడం లేదని ప్రశ్నించారు. పెట్టుబడులు పెడతామంటూ ముందుకు వస్తున్నా వారిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ప్రకాశం జిల్లాను ఎందుకు పక్కనపెట్టారో జవాబు చెప్పాలని ఆయన శాసనమండలిలో ప్రభుత్వాన్ని నిలదీయడం టీడీపీలో చర్చనీయాంశంగా మారింది.
Next Story

