Fri Mar 20 2026 15:48:37 GMT+0530 (India Standard Time)
కాపులను బాబు తిడుతున్నాడు

కాపు రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం కేవలం మొక్కుబడిగా మాత్రమే కేంద్రానికి పంపిందని, అందులో పూర్తి సమాచారం లేదని కేంద్రం వెనక్కి పంపడం వాస్తవం కాదా అని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కాపులను మోసం చేయడమే కాక ఇష్టమొచ్చినట్లు తిడుతున్నారని వాపోయారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడిని చిత్తుగా ఓడించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 1910 నుంచి తమకు రిజర్వేషన్లు ఉన్నాయని, గతంలో ఉన్నవాటినే మళ్లీ అమలుచేయాలని తాము కోరుతున్నామన్నారు.
Next Story

