కన్నా ఇంటిపై దాడికి యత్నం…?
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడిచేశారు. నిన్న కాకినాడలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయ్ ను బీజేపీ [more]
బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడిచేశారు. నిన్న కాకినాడలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయ్ ను బీజేపీ [more]

బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఇంటిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడిచేశారు. నిన్న కాకినాడలో జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాన్వాయ్ ను బీజేపీ నేతలు అడ్డుకున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా ఈరోజు గుంటూరులోని కన్నా నివాసాన్ని కొందరు టీడీపీ కార్యకర్తలు ముట్టడించారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టాల్సి వచ్చింది. ఈ సందర్భంగా కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తనను చంపేందుకు నారా చంద్రబాబునాయుడు, లోకేష్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తనమీద జరిగిన హత్యాయత్నంపై కేసు నమోదు చేయాలని కేంద్ర హోంశాఖను కోరనున్నట్లు ఆయన తెలిపారు. గతంలో అమిత్ షా పై దాడి చేశారని, నిన్న గాక మొన్న పవన్ పై కూడా ఇదే తరహా దాడి జరిగిందని, ఇప్పుడు తన ఇంటిపైనే దాడి చేసేందుకు ప్రయత్నించారని ఆరోపించారు. చంద్రబాబు రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ భ్రష్టు పట్టించారని ఆయన ఆరోపించారు.
- Tags
- amithshah
- andhrapradesh
- bharathiya janatha party
- kanna lakshmi narayana
- nara chandrababu naidu
- nara lokesh
- pawan kalyan
- ఠమితౠషా
- à°à°à°§à±à°°à°ªà±à°°à°¦à±à°¶à±
- à°à°¨à±à°¨à°¾ à°²à°à±à°·à±à°®à±à°¨à°¾à°°à°¾à°¯à°£
- à°¤à±à°²à±à°à±à°¦à±à°¶à° పారà±à°à±
- నారా à°à°à°¦à±à°°à°¬à°¾à°¬à±à°¨à°¾à°¯à±à°¡à±
- నారా à°²à±à°à±à°·à±â
- పవనౠà°à°²à±à°¯à°¾à°£à±
- à°à°¾à°°à°¤à±à°¯ à°à°¨à°¤à°¾ పారà±à°à±

