ఇద్దరూ పరారయ్యారే
వైెఎస్.జగన్, చంద్రబాబునాయుడులపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ వరదల్లో మునిగిపోతుంటే ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటనకు వెళ్లారన్నారు. ప్రజలు బాగోగులను [more]

వైెఎస్.జగన్, చంద్రబాబునాయుడులపై భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ సెటైర్లు వేశారు. ఆంధ్రప్రదేశ్ వరదల్లో మునిగిపోతుంటే ముఖ్యమంత్రి జగన్ అమెరికా పర్యటనకు వెళ్లారన్నారు. ప్రజలు బాగోగులను పట్టించుకోకుండా జగన్ అమెరికాకు వెళ్లడమేంటని ప్రశ్నించారు. అలాగే ఐదేళ్లు అధికారంలో ఉండి ఏపీని అప్పుల్లో ముంచిన చంద్రబాబు నాయుడు వరదల సమయంలో పొరుగు రాష్ట్రంలో తలదాచుకున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన ఇల్లు మునిగిపోయిందని హైదరాబాద్ వెళ్లారు. ఈ ఇద్దరు తోక నేతలు ఇల్లు మునిగిందా? లేదా? అన్నదానిపై చర్చ చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా వరద బాధితులను ఆదుకోవాలని కన్నా లక్ష్మీనారాయణ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.