Mon Mar 23 2026 17:52:22 GMT+0530 (India Standard Time)
కన్నాకు తీవ్ర అస్వస్థత....!

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈరోజు తెల్లవారు జామున హైబీపీ రావడంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన గుంటూరులోని ఒక ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కన్నాకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. అస్వస్తతకు గురైన కన్నా లక్ష్మీనారాయణకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. నిన్న బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు జగన్ పార్టీలో చేరాల్సి ఉంది. ఈ మేరకు డేట్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. కృష్ణా జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో తన అనుచరులతో కలసి వచ్చి కన్నా వైసీపీలో నేడు చేరాలనుకున్నారు. కాని కన్నా అస్వస్థతకు గురి కావడంతో ఈ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది.
Next Story

