Mon Mar 23 2026 12:50:44 GMT+0530 (India Standard Time)
ఆసుపత్రి నుంచి కన్నా...?

కన్నా లక్ష్మీనారాయణ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండు రోజుల క్రితం హైబీపీ రావడంతో కన్నాను గుంటూరులోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. ఆయనకు రెండు రోజుల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు. ఈ రెండు రోజులపాటు ఆసుపత్రిలోనే వైద్యుల సంరక్షణలో ఉన్న కాన్నా కొద్దిసేపటి క్రితం ఇంటికి చేరుకున్నారు. కాగా కన్నా ఈ నెల 25వ తేదీన వైసీపీలో చేరాల్సి ఉండగా, ఆయన అస్వస్థతకు గురవ్వడంతో వాయిదా పడింది. కన్నా ఆరోగ్యం మెరుగుపడి ఇంటికి చేరుకోవడంతో వైసీపీలో చేరే తేదీని ఆయన నిర్ణయించవచ్చని తెలుస్తోంది.
Next Story

