Sat Mar 21 2026 15:40:52 GMT+0530 (India Standard Time)
బాబుకు జ్వరం వచ్చినా మోదీ కుట్రేనా..?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాని మోదీని చూసి చంద్రబాబు నాయుడు బయపడుతున్నారని, చంద్రబాబుకు జ్వరం వచ్చినా మోదీ కుట్ర అంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు ప్రచార ఆర్భాటం వల్లే గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట జరిగిందని, ప్రచారం కోసం జియాగ్రఫిక్ ఛానల్ కు రూ.63 లక్షలు ఇచ్చారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇద్దరు దొంగలు పోటీ చేస్తే చంద్రబాబు బెటర్ దొంగ అని ప్రజలు గెలిపించారని... గెలిచాక ఆయన గజదొంగగా మారారని విమర్శించారు.
Next Story

