Sun Mar 15 2026 09:33:07 GMT+0530 (India Standard Time)
ఆగిన కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు ఆగిపోయాయి. ఇప్పటికే నత్త నడకన సాగుతున్న ఈ పనులకు బ్రేక్ పడింది. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఫ్లైఓవర్ నిర్మాణ కార్మికులు [more]
విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు ఆగిపోయాయి. ఇప్పటికే నత్త నడకన సాగుతున్న ఈ పనులకు బ్రేక్ పడింది. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఫ్లైఓవర్ నిర్మాణ కార్మికులు [more]

విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పనులు ఆగిపోయాయి. ఇప్పటికే నత్త నడకన సాగుతున్న ఈ పనులకు బ్రేక్ పడింది. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఫ్లైఓవర్ నిర్మాణ కార్మికులు విధులు బహిష్కరించారు. దీంతో ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుపుతున్న సోమా సంస్థ జీఎం శ్రీనివాస్ కార్మికులతో చర్చలు జరిపారు. అయితే, నాలుగు నెలల జీతంలో కనీసం రెండు నెలల జీతం ఇస్తేనే పనులు చేస్తామని కార్మికులు చేప్పారు. దానిపై కూడా సంస్థ యాజమాన్యం స్పష్టత ఇవ్వకపోవడంతో కార్మికులు విధులు బహిష్కరించారు. నాలుగు నెలలుగా జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకాలని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Next Story