Fri Mar 27 2026 09:13:09 GMT+0530 (India Standard Time)
జగన్ దాగుడుమూతలు మానుకో

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి దాగుడు మూతలు మానుకోవాలని ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో జగన్ పోటీ చేయకుండా పరోక్ష మద్దతుకు టీఆర్ఎస్ కు ఎందుకిచ్చారో చెప్పాలన్నారు. ఏపీ ప్రభుత్వంపై కేసీఆర్ కుట్రలు చేస్తున్న విషయం జగన్ కు తెలియదా? అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాకు అడ్డుపడ్డ టీఆర్ఎస్ కు జగన్ మద్దతివ్వడమంటే రాష్ట్రానికి ద్రోహం చేసినట్లేనని తెలిపారు. ఆయన జగన్ కు రాసిన లేఖలో ఈ విషయాలను పేర్కొన్నారు. విజయసాయి రెడ్డి, చెవిరెడ్డి భాస్కరరెడ్డిలు కేసీఆర్ తో మంతనాలు జరపడం వాస్తవం కాదా? అని నిలదీశారు. కూకట్ పల్లి అభ్యర్థి గెలిచిన తర్వాత జగన్ కు ఎందుకు కృతజ్ఞతలు తెలిపారో ఏపీ ప్రజలకు జగన్ వివరణ ఇవ్వాలని తన లేఖలో కోరారు.
Next Story

