Sat Jan 31 2026 20:11:25 GMT+0000 (Coordinated Universal Time)
కేంద్రం రాకుంటే నేనే నిర్మిస్తా

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేస్ చేత దీక్ష విరమింప చేశారు. ఆయన చేత స్వయంగా నిమ్మరసం ఇచ్చి విరమింపచేశారు. సీఎం రమేష్ కడప ఉక్కు ఫ్యాక్టరీ కోసం 11 రోజులుగా దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కడప లో ఉక్కు ఫ్యాక్టరీని పెట్టకున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్థాపిస్తుందని హామీ ఇచ్చారు. తొలుత కేంద్రం నుంచి వచ్చే స్పందన కోసం ఎదురు చూస్తామన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టేందుకు కేంద్రం ముందుకు వస్తే తాము 50శాతం భరిస్తామని చంద్రబాబు చెప్పారు. అందుకు కూడా కేంద్రం అంగీకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే ఇక్కడ నిర్మిస్తుందని చెప్పారు. అలాగే వైసీపీ, బీజేపీ లు కుమ్మక్కై కడపలో ఉక్కు ఫ్యాక్టరీ రాకుండా అడ్డుకుంటున్నాయని విమర్శించారు.
Next Story
