Sat Jan 31 2026 18:45:32 GMT+0000 (Coordinated Universal Time)
హీటెక్కిన కడప

కడప జిల్లా బంద్ కు నేడు వైసీపీ పిలుపునిచ్చింది. వైసీపీతో వామపక్షాలు జతకలిశాయి. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు కడప జిల్లాలో బంద్ జరుగుతుంది. ఈరోజు ఉదయమే కడప జిల్లాలోని వివిధ బస్సు డిపోల వద్ద వైసీపీ, వామపక్ష కార్యకర్తలు బైఠాయించి డిపోల నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. కడపలో స్టీల్ ప్లాంట్ కోరుతూ ఇప్పటికే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ చేపట్టిన ఆమరణ దీక్ష పదో రోజుకు చేరుకుంది. ఇటు టీడీపీ నేత సీఎం రమేష్ ఆమరణదీక్ష, మరోవైపు వైసీపీ, వామపక్షాలు బంద్ కు పిలుపునిచ్చిన నేపథ్యంలో కడప జిల్లాలో పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Next Story
