Thu Mar 19 2026 00:10:26 GMT+0530 (India Standard Time)
పవన్ రాజకీయాలపై కేఏ పాల్ వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి ఆశించినంత మైలేజ్ రావడం లేదని ప్రజాశాంతి పార్టీ అధినేత, క్రైస్తవ మత ప్రభోదకుడు కేఏ పాల్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం తెలుగు రాష్ట్రాల రాజకీయాలపై మీడియాతో మాట్లాడారు. మొదట తెలంగాణ ఎన్నికలపై దృష్టి సారించానని, తర్వాత మే నెల వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఫోకస్ పెడతానన్నారు. తెలంగాణలో అన్ని పార్టీలూ దళితులు, బీసీలకు టిక్కెట్ల కేటాయింపులో అన్యాయం చేశాయన్నారు. తనను కలిశాకనే బీసీ నేత ఆర్.కృష్ణయ్య, దళిత నేత అద్దంకి దయాకర్ కి టిక్కెట్లు దక్కాయని స్పష్టం చేశారు. టిక్కెట్లు దక్కని వారు తనను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని, తనను రాజకీయాల్లోకి రావాలని కోరారని పేర్కొన్నారు.
Next Story

