Thu Mar 19 2026 18:22:22 GMT+0530 (India Standard Time)
కేకేపై టీజీ ఘాటు వ్యాఖ్యలు

తెలంగాణ ఉద్యమంలో కె.కేశవరావు ఎక్కడున్నారని తెలుగుదేశం రాజ్య సభ సభ్యుడు టీజీ వెంకటేశ్ ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్నంతా ముందుంది నడిపింది కేసీఆర్ మాత్రమేనన్నారు టీజీ. ఆయన ఢిల్లీలో మాట్లాడుతూ కేశవరావు తనకు మతిస్థిమితం లేదని వ్యాఖ్యానించడంపై మండిపడ్డారు. కేకే కు మోకాళ్లలో మెదడు ఉందన్నారు. కేకేకు రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి ఇస్తే తాను ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. ఏపీ ప్రత్యేక హోదా కోసం తెలంగాణ ప్రభుత్వం కూడా తమతో కలసి రావాలని టీజీ మరోసారి పిలుపునిచ్చారు.కే ఫుల్లుగా మందుకొట్టి సాయంత్రానికి కేసీఆర్ కాళ్లుపట్టుకుంటారని తీవ్ర విమర్శలు చేశారు. కేకే రక్తంలోనే మద్యం ఉందన్నారు. తాగుబోతు కేకే తననేమీ చేయలేరన్నారు.
Next Story

