Fri Mar 20 2026 19:24:41 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ పై లోకేశ్ ఫైర్

తెలంగాణ రాష్ట్ర సమితిలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు లేరా? అని ఆంధ్రప్రదేశ్ మంత్రి, చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ప్రశ్నించారు. ఆంధ్రావాళ్ల ఓట్లను వేయించుకున్న కేసీఆర్ జీహెచ్ఎంసీలో గెలిచింది నిజం కాదా?అని ఆయన ప్రశ్నించారు. తెలుగువారంతా కలసి ఉండాలని ఒకపక్క కేసీఆర్ చెబుతూనే మరోవైపు జాగో బాగో అనడమేమిటని కేసీఆర పై లోకేష్ మండి పడ్డారు. ఆంధ్రావాళ్ల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలను తన పక్కన పెట్టుకుని ఇలా మాట్లాడటం సరికాదన్నారు. తెలంగాణలో టీడీపీ క్యాడర్ బలంగా ఉందన్నారు. నేతలు వెళ్లిపోయినా పార్టీ జెండా పట్టుకుని కార్యకర్తలు ఇంకా అలానే ఉండటం తమ బలమని లోకేశ్ చెప్పుకొచ్చారు. ఆయనకాసేపటి క్రితం ఏపీ శాసనసభలో మీడియా మిత్రులతో చిట్ చాట్ చేశారు.
Next Story

