Sun Mar 15 2026 18:57:59 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీకి ముఖ్యమంత్రి కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సెప్టంబరు 2వ తేదీన జరగనున్న టీఆర్ఎస్ భవన్ భూమి పూజ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు. టీఆర్ఎస్ భవన్ [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సెప్టంబరు 2వ తేదీన జరగనున్న టీఆర్ఎస్ భవన్ భూమి పూజ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు. టీఆర్ఎస్ భవన్ [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. సెప్టంబరు 2వ తేదీన జరగనున్న టీఆర్ఎస్ భవన్ భూమి పూజ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు. టీఆర్ఎస్ భవన్ కు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం స్థలాన్ని కేటాయించడంతో అక్కడ పార్టీ భవన నిర్మాణాన్ని చేపట్టనున్నారు. ఈరోజు మధ్యాహ్నం బేగంపేట నుంచి కేసీఆర్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నేతల కోసం ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు.
Next Story