Sun Mar 15 2026 22:12:03 GMT+0530 (India Standard Time)
నేడు సాగర్ కు కేసీఆర్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం పది గంటలకు ప్రగతి భవన్ నుంచి [more]
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం పది గంటలకు ప్రగతి భవన్ నుంచి [more]

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నేడు నాగార్జున సాగర్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. ఉదయం పది గంటలకు ప్రగతి భవన్ నుంచి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. అనంతరం అక్కడ మార్కెట్ యార్డులో ప్రజాప్రతినిధులు, అధికారులతో అభివృద్ధిపై కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారు. ఉప ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల అమలు పురోగతిని కేసీఆర్ పరిశీలించనున్నారు. ఎమ్మెల్యే నోముల భగత్ ఇంట్లో లంచ్ చేసిన అనంతరం తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.
Next Story