Mon Dec 08 2025 16:09:28 GMT+0000 (Coordinated Universal Time)
సాగర్ లో గెలుపు మనదే.. సర్వేలన్నీ మనకే అనుకూలం
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ నాగార్జున సాగర్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా [more]
నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ నాగార్జున సాగర్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా [more]

నాగార్జున సాగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. కేసీఆర్ నాగార్జున సాగర్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. నోముల భగత్ కు బీఫారంతో పాటు 28 లక్షల చెక్ ను పార్టీ తరుపున కేసీఆర్ అందజేశారు. అభ్యర్థి ఎంపికపై అనేక రకాలుగా సర్వేలు చేయించామని కేసీఆర్ చెప్పారు. సర్వేలన్నీ టీఆర్ఎస్ కే అనుకూలంగా ఉన్నాయని చెప్పారు. నేతలంతరూ సమిష్టిగా పనిచేయాలని కేసీఆర్ ఈ సందర్భంగా నేతలను ఆదేశించారు. దుబ్బాక వేరు, నాగార్జున సాగర్ ఎన్నిక వేరు అని కేసీఆర్ అభిప్రాయపడ్డారు.
Next Story