Fri Mar 20 2026 13:04:50 GMT+0530 (India Standard Time)
రద్దు దిశగా...ఇక జెట్ స్పీడ్ తో...?

ముందస్తుకు ఏర్పాట్లు ఊపందుకున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో ప్రగతి భవన్ లో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోషితో పాటు అసెంబ్లీ కార్యదర్శి నరిసింహా చార్యులు, ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మలు సమావేశమయ్యారు. రేపటి మంత్రివర్గ సమావేశం అజెండాను ఈ సమావేశంలో రెడీ చేయనున్నారు. రేపు మంత్రి వర్గ సమావేశం ఎన్నింటికి నిర్వహించాలన్నదానిపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. కేబినెట్ భేటీలోనే అసెంబ్లీ రద్దుకు తీర్మానం చేసి గవర్నర్ కు ఇస్తారన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. అందుకే కేసీఆర్ జెట్ స్పీడ్ తో సమావేశాలను కేసీఆర్ నిర్వహిస్తున్నారు.
Next Story

