Fri Jan 30 2026 18:24:52 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : మోడీతో కేసీఆర్ భేటీ...ఏంటంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితం సమావేశమైన కేసీఆర్ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న పలు సమస్యలను ప్రస్తావించనున్నారు. కొత్త జోన్ల అంశం, రిజర్వేషన్లకు ఆమోదం వంటి అంశాలపై చర్చించనున్నారు. అలాగే తెలంగాణలో అమలుపరుస్తున్న రైతుబంధు పథకం గురించి కూడా కేసీఆర్ వివరించనున్నారు. అలాగే ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్ తెలంగాణకే చెందుతుందని, తమకే అప్పగించాలని ప్రధానిని కోరనున్నట్లు తెలిసింది. నాలుగు రోజులపాటు ఢిల్లీలో ఉండే కేసీఆర్ ఈ నెల17వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరుకానున్నారు.
Next Story
