Fri Mar 20 2026 07:03:41 GMT+0530 (India Standard Time)
కేసీఆర్ కు జైకొట్టిన ఏపీ ప్రజలు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలంగాణలోనే కాదు ఆంధ్రప్రదేశ్ లో వీరాభిమానులున్నారు. ఆయన ఉద్యమం నిర్వహించిన తీరును చూసి ఏపీలో కూడా చాలా మంది ఫిదా అయ్యారు. కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వెళితే ఫ్లెక్సీలు కట్టి తమ అభిమానాన్ని చాటుకుంటారు. కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలు కూడా గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో నిర్వహిస్తారు.
ప్రగతినివేదన సభలో ఆంధ్రులు.....
అలాంటిది తమ అభిమాన నేత ప్రగతి నివేదన సభ పెడితే ఊరుకుంటారా? తెలంగాణ నుంచి లక్షలాది మంది పార్టీ శ్రేణులు ప్రగతి నివేదన సభకు తరలి వస్తున్నాయి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా వందల సంఖ్యలో కేసీఆర్ అభిమానులు కొంగర కలాన్ కు వస్తుండటం విశేషం. కేసీఆర్ పాలన తమకు నచ్చిందంటున్నారు ఆంధ్రావాసులు. కొంగర కలాన్ లో ఆంధ్రప్రజలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
Next Story

