Sun Mar 15 2026 22:54:54 GMT+0530 (India Standard Time)
ఆఖరి నిమిషం వరకూ… బాధ్యతలను స్వీకరించే వరకూ?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ కొద్దిసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. నిన్న ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చిన ప్రభుత్వం ఎవరిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా [more]
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ కొద్దిసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. నిన్న ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చిన ప్రభుత్వం ఎవరిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా [more]

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా కనగరాజ్ కొద్దిసేపటి క్రితం బాధ్యతలు స్వీకరించారు. నిన్న ఆర్డినెన్స్ ను తీసుకు వచ్చిన ప్రభుత్వం ఎవరిని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నియమించేదీ అత్యంత గోప్యంగా ఉంచింది. ఆఖరు నిమిషం వరకూ ఎవరికీ తెలియలేదు. జస్టిస్ కనగరాజ్ పేరు బయటకు వచ్చిన వెంటనే ఆయన విజయవాడలో ఉండటం విశేషం. ఆయన బాధ్యతలను కూడా స్వీకరించారు. జీవోలతో పాటు కనగరాజ్ నియామకం కూడా అత్యంత రహస్యంగా ప్రభుత్వం చేసింది. న్యాయస్థానాల్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకే గంటల వ్యవధిలోనే నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను తొలగించడం, కనగరాజ్ ను నియమించడం జరిగిపోయాయి.
Next Story