Sun Mar 15 2026 22:52:25 GMT+0530 (India Standard Time)
కరోనా సమయంలో కనగరాజ్ ను ఎలా తెచ్చారు?
కరోనా వైరస్ వణికిస్తుంటే జస్టిస్ కనగరాజ్ ను ఆంధ్రప్రదేశ్ కు ఎలా తీసుకు వచ్చారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సరిహద్దులు మూసివేసి ఉన్నా ఆయన ఏపీకి [more]
కరోనా వైరస్ వణికిస్తుంటే జస్టిస్ కనగరాజ్ ను ఆంధ్రప్రదేశ్ కు ఎలా తీసుకు వచ్చారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సరిహద్దులు మూసివేసి ఉన్నా ఆయన ఏపీకి [more]

కరోనా వైరస్ వణికిస్తుంటే జస్టిస్ కనగరాజ్ ను ఆంధ్రప్రదేశ్ కు ఎలా తీసుకు వచ్చారని టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. సరిహద్దులు మూసివేసి ఉన్నా ఆయన ఏపీకి ఎలా రాగలిగారన్నారు. అందులో అత్యధిక కేసులున్న తమిళనాడు నుంచి కనగరాజ్ ను తేవడం ఆందోళన కల్గిస్తుందన్నారు. ఆయన వయసు 74 ఏళ్లని, ఆయన కనీసం బాధ్యతలను స్వీకరించే సమయంలోనూ మాస్క్ ధరించలేదని అచ్చెన్నాయుడు ఫైర్ అయ్యారు. తెలంగాణ నుంచి మనవాళ్లను ఏపీలోకి రావాలంటే 14 రోజులపాటు క్వారంటైన్ విధదిస్తున్నారని, మరి కనగరాజ్ కు ఈ నిబంధన వర్తించదా? అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు.
Next Story