Fri Dec 05 2025 18:06:17 GMT+0000 (Coordinated Universal Time)
Huzurabad : ఓటుకు నోటు ఇవ్వడం లేదంటూ ఆందోళన
హుజూరాబాద్ ఎన్నికల్లో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు ధర్నాకు దిగారు. ఎన్నికకు ఇంకా రెండు రోజుల సమయమే ఉండటంతో హుజూరాబాద్ లో అన్ని రాజకీయ పార్టీలూ పెద్దయెత్తున [more]
హుజూరాబాద్ ఎన్నికల్లో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు ధర్నాకు దిగారు. ఎన్నికకు ఇంకా రెండు రోజుల సమయమే ఉండటంతో హుజూరాబాద్ లో అన్ని రాజకీయ పార్టీలూ పెద్దయెత్తున [more]

హుజూరాబాద్ ఎన్నికల్లో తమకు డబ్బులు ఇవ్వలేదంటూ ఓటర్లు ధర్నాకు దిగారు. ఎన్నికకు ఇంకా రెండు రోజుల సమయమే ఉండటంతో హుజూరాబాద్ లో అన్ని రాజకీయ పార్టీలూ పెద్దయెత్తున ఓటర్లకు డబ్బులు పంచుతున్నాయి. ఓటుకు ఆరు నుంచి పదివేల వరకూ కవర్లలో పెట్టి ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. అయితే నియోజకవర్గంలోని రంగాపూర్ లో తమకు డబ్బులు ఇవ్వడం లేదంటూ గ్రామస్థులు రంగాపూర్ రహదారిపై ఆందోళనకు దిగారు. అందరికీ ఇచ్చి తమకు మాత్రం ఇవ్వలేదంటున్నారు.హైదరాబాద్ నుంచి పోలింగ్ కోసం రప్పించి తమను పట్టించుకోవడం లేదని మరికొందరు ఆరోపిస్తున్నారు.
Next Story