Tue Mar 24 2026 02:06:20 GMT+0530 (India Standard Time)
బ్రహ్మానందంలా రాజేంద్రప్రసాద్ మాటలు

జగన్ ను హత్య చేసేందుకు విజయమ్మ, షర్మిల కుట్ర చేశారని టీడీపీ ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ చేసిన ఆరోపణలను అదే పార్టీ నేత జూపూడి ప్రభాకర్ రావు ఖండించారు. రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో సీరియస్ అంశంపై చర్చ జరుగుతుంటే సినిమాల్లో బ్రహ్మానందంలా జోకులు వేయడం సరికాదని పేర్కొన్నారు. ఆయనను జోకర్ గానే తీసుకుంటామని స్పష్టం చేశారు. అరవింద సమేత సినిమాలో ‘ఆకు కావాలా..? పోక కావాలా..?’ అంటూ కామెడియన్ అడిగినట్లుగా రాజేంద్ర ప్రసాద్ మాట్లాడారని ఎద్దేవా చేశారు.
Next Story

