Tue Mar 24 2026 01:36:21 GMT+0530 (India Standard Time)
బ్రేకింగ్ : బాంబుపేలుళ్ల కేసులో తీర్పు చెప్పిన న్యాయమూర్తి రాజీనామా?

నాంపల్లి ఎన్ఐఏ కోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీందర్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. మాక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో ఈరోజు రవీందర్ రెడ్డి తీర్పు చెప్పారు. మక్కా మసీదు బాంబు పేలుళ్ల కేసులో ఐదుగురు నిందితులూ నిర్దోషులని రవీందర్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నమే తీర్పు చెప్పారు. అయితే కారణాలు తెలియకపోయినప్పటికీ తన రాజీనామా లేఖను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి రవీందర్ రెడ్డి పంపినట్లు తెలుస్తోంది. తీర్పు విషయంలో రవీందర్ రెడ్డి మనస్తాపం చెందినట్లు సన్నిహితులుచెబుతున్నారు. తీర్పు విషయంలో ఏమైనా వత్తిళ్లు వచ్చాయా? అన్న అనుమానమూ వ్యక్తమవుతోంది.
Next Story

