Mon Feb 02 2026 05:38:55 GMT+0000 (Coordinated Universal Time)
బ్రేకింగ్ : హైదరాబాద్ లో జడ్జి అరెస్ట్....సంచలనం

నాంపల్లి మెట్రో పాలిటిన్ కోర్టు న్యాయమూర్తిని ఏసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక కేసులో బెయిల్ ఇచ్చేందుకు న్యాయమూర్తి రాధాకృష్ణమూర్తి 7.50 లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్నట్లు న్యాయవాది ఒకరు హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు సూచన మేరకు విచారణ ప్రారంభించిన ఏసీబీ ఈరోజు ఉదయం నుంచి న్యాయమూర్తి ఇంట్లో సోదాలు నిర్వహించింది. కొద్దిసేపటి క్రితం న్యాయమూర్తితో పాటు ఆయనకు సహకరించిన ఇద్దరు న్యాయవాదులను కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
Next Story
