Mon Dec 09 2024 06:25:07 GMT+0000 (Coordinated Universal Time)
హెల్త్ వర్సిటీ పేరు మార్చడంపై స్పందించిన జూ.ఎన్టీఆర్
దీనిపై నందమూరి ఫ్యామిలీ కూడా స్పందించింది. తాజాగా.. ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్..
ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో కాకరేపుతున్న విషయం ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్చడం. నిన్న అసెంబ్లీ సమావేశంలో.. విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును మారుస్తూ వైసీపీ సర్కారు సభలో ఓ కీలక బిల్లును ప్రవేశపెట్టింది. ఆ బిల్లును సభ కూడా ఆమోదించింది. సీఎం జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై టీడీపీ సహా పలు రాజకీయ పార్టీలు, సీనియర్, జూనియర్ ఎన్టీఆర్ ల అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జగన్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబు.. వర్సిటీ పేరు మార్చడంపై గవర్నర్ ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు.
దీనిపై నందమూరి ఫ్యామిలీ కూడా స్పందించింది. తాజాగా.. ఎన్టీఆర్ మనవడు, టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఈ వ్యవహారంపై తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ఈ మేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు. ఎన్టీఆర్, వైఎస్సార్ ఇద్దరూ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని తారక్ తన ప్రకటనలో పేర్కొన్నాడు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదని, ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని తెలిపాడు. 'విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలను చెరిపివేయలేరు' అని పేర్కొన్నాడు.
Next Story